Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన దివ్యాంగులకు చేయూత పెన్షన్ అందించాలి

అర్హులైన దివ్యాంగులకు చేయూత పెన్షన్ అందించాలి

- Advertisement -

దివ్య దేవరాజన్
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని ఐకెపి కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన జూమ్ సమావేశంలో టి-సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందించే నూతన చేయూత పెన్షన్‌కు అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఎస్.హెచ్.జి లీడర్ బాధ్యత తీసుకొని తమ గ్రామాల్లో అర్హులైన దివ్యాంగులను గుర్తించి పెన్షన్ కోసం దరఖాస్తు చేయించాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని అర్హులైన ప్రతి దివ్యాంగుడు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, సీసీలు, దివ్యాంగుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -