Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాఘవపురంలో వయోవృద్ధుల కమిటీ ఎన్నిక

రాఘవపురంలో వయోవృద్ధుల కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం రాఘవపురం గ్రామంలో వయోవృద్ధుల కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు.గ్రామ సర్పంచ్ పరిదె మమత సంతోష్,ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా సభ్యులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ,ఒగ్గు క్రిష్టఫర్,మండల కమిటీ ప్రధాన కార్యదర్శి పరిగల రాములు,కొలనుపాక వయోవృద్ధుల కమిటీ అధ్యక్షులు గాదె రాజిరెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశానికి గ్రామానికి చెందిన సుమారు 50 మంది వయోవృద్ధులు హాజరయ్యారు.

సమావేశంలో నూతన వయోవృద్ధుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా నమిలే రాజయ్యగౌడ్,కోశాధికారిగా బొంకూరి లక్ష్మీనారాయణ,ప్రధాన కార్యదర్శిగా శీలం మల్లారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా నాయుడు పాపిరెడ్డి,మండల సమన్వయకర్తగా శీలం అంజిరెడ్డి,గౌరవ సలహాదారుగా శీలం రామ్‌రెడ్డి ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా మల్లూరు పెంటమ్మ,గడిపి మల్లయ్య,ఎర్ర యాదగిరి తదితరులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వయోవృద్ధులకు కృతజ్ఞతలు తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -