Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదల ఇండ్ల నిర్మాణానికి పారిశ్రామిక తోడ్పాటు

పేదల ఇండ్ల నిర్మాణానికి పారిశ్రామిక తోడ్పాటు

- Advertisement -

ఇందిరమ్మ ఇండ్లకు రూ.230 కే సిమెంట్ బస్తా
పరిశ్రమల సామాజిక బాధ్యతకు 
మంత్రి పొంగులేటి ప్రశంసలు
​నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్

పేదల ఇండ్ల నిర్మాణానికి పారిశ్రామిక తోడ్పాటు లభించింది. ఇందిరమ్మ ఇండ్లకు రూ.230 కే సిమెంట్ బస్తా ఇచ్చేందుకు పరిశ్రమలు ముందుకొచ్చాయి. వాటి సామాజిక బాధ్యతను రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ధరల త‌గ్గింపుపై ఆయా ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌తో మంత్రి స‌మావేశ మ‌య్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా (హైద‌రాబాద్ మినహా) మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. వీటిలో ఇప్పటికే గణనీయ సంఖ్యలో 85 శాతం ఇండ్ల శ్లాబులు పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రెండో విడతలో నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంతో 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మించనున్నట్టు చెప్పారు. 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతికి అనుగుణంగా విడతల వారీగా ప్ర‌తి సోమ‌వారం పారదర్శకంగా నిధులను విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకంలో సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాలు కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని ఆయన పిలుపునిచ్చారు. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి సిమెంట్‌ను త‌క్కువ ధ‌ర‌కే అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఆయన విజ్ఞ‌ప్తి మేర‌కు ఒక్కో బ‌స్తాను రూ.230కి ఇవ్వడానికి పరిశ్రమల యజమానులు అంగీక‌రించారు. మంత్రి పొంగులేటి ఆయా పరిశ్రమల యజమానులకుమక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సమావేశంలో ప‌రిశ్ర‌మల యాజ‌మాన్యాల‌తోపాటు హౌసింగ్ సెక్రెటరీ వి.పి.గౌత‌ం త‌దిత‌రులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -