Wednesday, August 19, 2026
E-PAPER
Homeమానవిలిప్‌స్టిక్ వాడేటప్పుడు..

లిప్‌స్టిక్ వాడేటప్పుడు..

- Advertisement -

లిప్‌స్టిక్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, కొన్ని లిప్‌స్టిక్‌లు పెదాలకు హాని కలిగించే రసాయనాలను కలిగి ఉంటాయి. దీని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిలపుణులు చెబుతున్నారు. కనుక లిప్‌స్టిక్ వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం:
అలెర్జీలు – చికాకు: లిప్‌స్టిక్‌లోని కొన్ని పదార్థాలు, ముఖ్యంగా సువాసనలు, రంగులు పెదాలకు చికాకు కలిగిస్తాయి.
లిప్‌స్టిక్ వాడిన తర్వాత పెదాలు ఎర్రగా మారడం, వాపు లేదా దురదగా ఉంటే మీరు దానిని వాడటం మానేసి వైద్యుడిని సంప్రదించాలి.
పొడిబారిన పెదాలు: కొన్ని లిప్‌స్టిక్‌లు పెదాలను పొడిగా, చిట్లేలా చేస్తాయి. కొన్ని పెదాల సహజ తేమను పీల్చుకుంటాయి. పొడి వాతావర ణంలో లేదా చలికాలంలో లిప్‌స్టిక్ వాడేటప్పుడు ఇది మరింత కష్టతరంగా అవుతుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం..
 పెదాలను శుభ్రం చేసుకోండి: లిప్ స్టిక్ అప్లై చేయడానికి ముందు పెదాలను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మృదువైన ఫేస్ వాష్ లేదా లిప్ స్క్రబ్ ను ఉపయోగించవచ్చు.
. పెదాలను తేమగా ఉంచుకోండి: లిప్ స్టిక్ అప్లై చేయడానికి ముందు పెదాలను మాయిశ్చరైజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం మీరు లిప్ బామ్ లేదా లిప్ ఆయిల్ ను ఉపయోగించవచ్చు.
 లిప్ లైనర్ ఉపయోగించండి: లిప్ లైనర్ ఉపయోగించడం వల్ల లిప్ స్టిక్ చక్కగా రావడానికి ఎక్కువ సేపు ఉండటానికి సహాయపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -