– పలు వివాహ వేడుకల్లో దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ మల్హర్ రావు: తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు శనివారం మండలంలోని ఆన్ సాన్ పల్లి, రుద్రారం గ్రామాల్లో పలు వివాహ శుభ కార్యాలయాల్లో హాజరై నూతన వధూవరులను అశ్విర్వదించారు.నూతన దంపతులు ఒక్కరికోక్కరు అనున్యంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీనుబాబు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, మాజీ ఎంపిపి ఇస్నపు రవి, రమేష్, భోగే మల్లయ్య, అశోక్, బుచ్చయ్య పాల్గొన్నారు.