Wednesday, August 19, 2026
E-PAPER
Homeజిల్లాలురాష్ట్ర పండుగగా పండుగల సాయన్న జయంతి, వర్ధంతిలు

రాష్ట్ర పండుగగా పండుగల సాయన్న జయంతి, వర్ధంతిలు

- Advertisement -
  • అధికారికంగా సభలు నిర్వహించాలి 
    – జీవో జారీకి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ 
  • – ముంఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్, ముదిరాజ్ నాయకులు 
  • నవతెలంగాణ – కామారెడ్డి 
  • నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దొరలు దేశ్ ముఖ్ లు గ్రామాల్లో సాగిస్తున్న దురాగతాలను, అరాచకాలను ఎదిరిస్తూ పోరాడిన వీరుడు పండుగల సాయన్న ముదిరాజ్ అని జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ తెలిపారు. ప్రజల కోసం పోరాడిన పండగల సాయన్న ముదిరాజ్ ను పాషవికంగా హత్య కావించ బడినాడని, చరిత్రలో ఈ విషయాన్ని నాటి పాలకులు దాచిపెట్టారని ఆయన వివరణ ఇచ్చారు. ముదిరాజ్ ముద్దుబిడ్డగా పాలమూరుకు చెందిన పండుగల సాయన్న ముదిరాజ్ జయంతి – వర్ధంతి సభలను అధికారికంగా నిర్వహించడానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి శేషాద్రి రాష్ట్ర కార్యదర్శితో పాటు బీసీ వెల్ఫేర్ కార్యదర్శికి ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించడం శుభపరిణామని హర్షాన్ని వ్యక్తం చేశారు.
  • అక్టోబర్ 22న పండుగల సాయన్న జయంతితో… పాటు డిసెంబర్ 10న జరిగే వర్ధంతి సభలను ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వమే బిసి సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలుపుతూ తన వ్యక్తిగత కార్యదర్శి ఆదేశాలనిస్తూ వెంటనే జీవో జారీ చేయాలని ఆదేశించడం హర్ష నియమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు తూర్పు రాజు ముదిరాజ్, సిద్దయ్య ముదిరాజ్, వెంకన్న ముదిరాజ్, రఘురామ్ ముదిరాజ్ లు పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ముదిరాజ్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశాలు జరిపి ముఖ్యమంత్రిని కలిసిన నేపథ్యంలో ఈ మేరకు “సీఎంఓ  పేషీ నుండి నోటు” ఆదేశాలు జారీ చేయడం తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
  • అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముదిరాజులు కూడా ఒక వరంగా భావించవచ్చని ముదిరాజ్ వారు పేర్కొన్నారు. ముఖ్యంగా పండుగల సాయన్న ముదిరాజ్ తో పాటు కీర్తిశేషులు స్వాతంత్ర సమరయోధులు కొరివి కృష్ణస్వామి జయంతి-వర్ధంతిలను సైతం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర పశుసంవర్ధక  మత్స్యశాఖ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముదిరాజ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రమ శక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ లు పండుగల సాయన్న ముదిరాజ్, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ , కేవల్ కిషన్ ముదిరాజ్ ల జయంతి – వర్ధంతి సభలను అధికారి కంగా నిర్వహించాలని పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
  • అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇటీవల కలిసిన నేపథ్యంలో ఈ మేరకు ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు వెలువడినాయని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యమంత్రిని ఒప్పించడంలో విశేషంగా కృషిచేసిన మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ అదే విధంగా ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజులకు ఈ సందర్భంగా ల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా పక్షాన ముఖ్యమంత్రి కి మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -