- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని వజ్రఖండి గ్రామ సర్పంచ్ సింత్రాళే సావిత్రి సోపాన్ ఫామ్ ఫండ్ పనులకు మార్కౌట్ వేసి పనులు ప్రారంభించడం జరిగిందని ఎఫ్ ఏ సోపాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా భూగర్భ జలాలు పెంచేందుకు ఫామ్ ఫండ్ లు నిర్మించుకోవడం వల్ల ఎంతో సహాయ సహయకారిగా ఉంటుందని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గ్రామాలలో నీటి కొరత ఏర్పడకుండా ముందస్తుగా వృధా నీటిని కాంపౌండ్ లోకి తరలించి నీటిని భూగర్భ జలాలను ఇంకిపోయే విధంగా ఉంటుందని అన్నారు. భూగర్భ జలాలు పెరిగితే వ్యవసాయదారులకు బోర్లు ఎత్తిపోత ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి, ఎఫ్ ఏ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



