సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రికి ఆరో వార్డు సభ్యులు నరేష్ ధన్యవాదాలు
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న చెట్లను బుధవారం తొలగించారు. స్థానిక హనుమాన్ ఆలయం వద్ద ఏపుగా పెరిగిన పలు చెట్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. దీంతో ఇటీవల మండల కేంద్రంలో నిర్వహించిన విద్యుత్ పరిష్కార వేదికలో సదురు చెట్లలను తొలగించాలని ఆరో వార్డు సభ్యులు అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. తాజాగా విద్యుత్ అధికారుల చొరవతో ఆ గ్రామ సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్ర్తీ జీపీ కార్యదర్శితో కలిసి చెట్ల కొమ్మలను తొలగించారు. అదేవిధంగా ఓల్టేజ్ సమస్య రాకుండా కరెంటు వైర్లను సరి చేయించారు. దీంతో ఆరో వార్డు సభ్యులు సర్పంచ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విద్యుత్ కు అంతరాయం..చెట్ల తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



