రెండు మొరం టిప్పర్లకు జరిమానా..

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని కోస్లీ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకొని తహసిల్దారు ధన్వాల్ 20వేల జరిమానాను శనివారం విధించారు. కోస్లి నుండి తాడు  బిలోకి అక్రమంగా మొరం తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో ధన్వాల్ టిప్పర్ కు 10000 చొప్పున రెండు టిప్పర్లకు 20,000 జరిమానా విధించారు. అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Spread the love