Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘గీతం’లో ఘనంగా ఫార్మకాలజీ దినోత్సవం

‘గీతం’లో ఘనంగా ఫార్మకాలజీ దినోత్సవం

- Advertisement -

కీలకోపన్యాసం చేసిన ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి శ్రీనివాసన్
నవతెలంగాణ-పటాన్‌చెరు

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్పీ)లో ‘మెరుగైన ఆరోగ్యం కోసం ఔషధ ఆష్కరణను ప్రోత్సహించడం’ అనే ఇతివృత్తంతో రెండవ జాతీయ ఫార్మకాలజీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. భారతీయ ఫార్మకాలజీ వ్యవస్థాపకులైన కల్నల్ ఆర్.ఎన్.చోప్రాను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఔషధ ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడనుంది. ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చడంలో ఫార్మకాలజీ పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా చాటింది. హైదరాబాదులోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్రిన్సిపల్, శాస్త్రవేత్త డాక్టర్ ‌కృష్ణమూర్తి శ్రీనివాసన్ ఈ-అబ్ స్ట్రాక్ట్ పుస్తకాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వర్ధమాన ఫార్మసిస్టులు నూతన ఆవిష్కరణలను స్వీకరించాలని ఆయన సూచించారు. శ్రేష్ఠతను సాధించాలని, ఫార్మాస్యూటికల్ పరిశోధన, ఆరోగ్య సంరక్షణకు అర్థవంతంగా దోహదపడాలని పిలుపునిచ్చారు. ఫార్మకాలజిస్టుల పాత్రను ప్రస్తావిస్తూ మెరుగైన ఆధారాలు, నిర్ణయాలు, వేగవంతమైన అనువాదం, మెరుగైన ఆరోగ్యాన్ని సాధించడమే అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు. పోటీ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన 120కి పైగా ఈ-పోస్టర్లను పరిశీలించి, వాటిలో మూడు అత్యుత్తమైన వాటిని ఎంపిక చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులతో పాటు జ్జాపికలు అందజేశారు. ఐదు, మూడు, రెండు వేల రూపాయల చొప్పున నగదు పురస్కారాలను కూడా అందజేశారు. బీ.ఫార్మసీ చివరి ఏడాది విద్యార్థిని రిధిమ స్వాగతనృత్యంతో కార్యక్రమం ప్రారంభం కాగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సోనియా రాణి స్వాగతోపన్యాసం చేశారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్, కార్యక్రమ ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథిని సత్కరించి, వందన సమర్పణ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -