వివాదంతో వార్తల్లోకి ‘బాసింగ బలాలే’ హీరో
మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో పట్టుకున్న భార్య
ఈశ్వరసాయిపై పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ – వేములవాడ
తెలంగాణ జానపద కళారంగంలో ప్రముఖ ఫోక్ నటుడు, గాయకుడు ఈశ్వరసాయి వివాదంలో చిక్కుకున్నారు. ‘బాసింగ బాసింగ బలాలే’, ‘ప్రమీల ఓ ప్రమీల’ తదితర పాటలతో గుర్తింపు పొందిన ఈశ్వరసాయి ఓ మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో పట్టుకున్నానంటూ ఆయన భార్య ఆరోపించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నంది కమాన్ సమీపంలోని రెడ్డి సంఘ భవనంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. తన భర్త అక్కడ ఓ మహిళా ఆర్టిస్ట్‌తో ఉన్నట్టు సమాచారం అందడంతో ఆయన భార్య అక్కడికి చేరుకొని, ఇద్దరినీ ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై ఈశ్వరసాయి భార్య శరణ్య వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తన భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తున్నప్పటికీ.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
నా భర్త మంచోడే.. ఆమెనే లొంగదీసుకుంది : ఫోక్ నటుడు, గాయకుడు ఈశ్వరసాయి భార్య శరణ్య
తన భర్తపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శరణ్య చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. తమకు వివాహమై ఏడేండ్లు అవుతోందని, తన భర్త మద్యం కూడా సేవించరని ఆమె మీడియాకు తెలిపారు. ఆ యువతికి బ్రేకప్ అయిన సమయంలో తానే దగ్గరుండి ఓదార్చానని, తనకు దగ్గరగా ఉంటూనే తననే మోసం చేస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వరసాయి ‘రాతిరి రాతిరి రాతిరిలో..’, ‘సీటి సీర’, ‘లాయి లాయి లబ్బరు బొమ్మ’ తదితర పాటలతో పాటు ఇటీవల ‘బాసింగ బాసింగ బలాలే’ పాటతో మరింత ప్రాచుర్యం పొందారు. తాజాగా ఆయనపై వచ్చిన ఆరోపణలు, వైరల్‌గా మారిన వీడియోతో ఈశ్వరసాయి పేరు జానపద కళారంగంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఫోక్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



