- Advertisement -
జ్ఞాపికను అందజేసిన ఎడిటర్
రాంపల్లి రమేశ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నవతెలంగాణ సీనియర్ ఫొటో జర్నలిస్టు, ఎడిటోరియల్ బోర్డు మెంబర్ కె.ఎన్.హరిని నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్ సన్మానించారు. ఆయనకు జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా కె.ఎన్.హరి మాట్లాడుతూ…ప్రజాశక్తి, నవతెలంగాణ పత్రికల్లో 33 ఏండ్ల నుంచి పనిచేస్తున్నానని చెబుతూ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటోరియల్ బోర్డు సభ్యులు జి. వేణుమాధవ్, బి.బసవపున్నయ్య, బీవీఎన్.పద్మరాజు, అజయ్, సీనియర్ జర్నలిస్టు ఎస్‌ఎస్‌ఆర్ శాస్ర్తి, ఎడిటోరియల్ బోర్డు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



