నవతెలంగాణ – మల్హర్ రావు
మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కొయ్యుర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, తాడిచెర్ల పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, చిన్న తూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి, వల్లెంకుంట సర్పంచ్ బొమ్మ రజిత రమేష్ రెడ్డి, కొండంపేట సర్పంచ్ బెల్లంకొండ జోష్ణ సరీన్ రావు, ఇప్పలపల్లె సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, మల్లారం సర్పంచ్ మేకల రాజయ్య, ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు లకావత్ సవేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం పోచయ్య, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్ళు పాల్గొన్నారు.
కొయ్యూర్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



