- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థులకు ప్రమాదం జరిగే రీతిలో అతివేగంగా, నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనం నడిపిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన 22 ఏళ్ల యువకుడు పల్సర్ 220 బైక్పై దమ్మపేట బోటనీ బాలాజీ స్కూల్ ఎదుట నుంచి అతివేగంగా, నిర్లక్ష్యంగా ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా వాహనం నడపడంతో ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ ఎస్ఐ బి.రాజేష్ తెలిపారు. రహదారులపై వాహనాలను జాగ్రత్తగా నడపాలని, ముఖ్యంగా పాఠశాలల పరిసరాల్లో వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచించారు.
- Advertisement -



