Thursday, August 20, 2026
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ బీఎల్ఏను పరామర్శించిన ఎమ్మెల్యే జారే

కాంగ్రెస్ బీఎల్ఏను పరామర్శించిన ఎమ్మెల్యే జారే

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
దమ్మపేట మండలం పార్కిలగండి చెందిన కాంగ్రెస్ బీఎల్ఏ కొమరం అర్జున్ రావును అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అర్జున్ రావు ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అర్జున్ రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోర్స సాగర్, కాంగ్రెస్ యూత్ నాయకులు శివాజీ, నాగేంద్ర, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -