- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని రామ్ సింగ్ తండాలో ఎంపీడీవో జయరాం నాయక్, సర్పంచ్ జ్యోతి అంబదాస్ సంయుక్తంగా ఫార్మ్ పాండ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడీఓ మాట్లాడుతూ.. రైతుల పొలాల్లో ఫార్మ్ పాండ్ నిర్మిస్తే పంటలకు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా ఉంటుందని, ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఉచితంగా ఏర్పాటు చేసుకునే సదుపాయం కల్పించిందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి అధికారి, ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ కూలీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



