– మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ – భిక్కనూర్
పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కాచాపూర్, కంచర్ల గ్రామాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఫ్రైడే డ్రై డే సందర్భంగా పలు కాలనీలలో ఆయన పర్యటించి గ్రామపంచాయతీ రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు దరి చేరి పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలో టాక్స్ కలెక్షన్, రికార్డులు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సవిత రెడ్డి, ఎంపీ ఓ రాజ్ కిరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజు, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



