Friday, August 21, 2026
E-PAPER
Homeఖమ్మంఅత్యుత్తమ ఫలితాలు సాధించిన 'సాయిస్ఫూర్తి' విద్యార్థులు

అత్యుత్తమ ఫలితాలు సాధించిన ‘సాయిస్ఫూర్తి’ విద్యార్థులు

- Advertisement -

– జిల్లాలోనే ఉత్తమ ఫలితాలుగా రికార్డు 
– అభినందించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి మండలం గంగారంలోని ‘సాయిస్ఫూర్తి’ అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జేఎన్టీయూహెచ్ ప్రకటించిన బీటెక్ ఫస్టియర్, ఎంబీఏ ఫస్ట్, సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఖమ్మం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఆ కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి తెలిపారు.  బ్రాంచీల వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థుల సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (ఎస్జీపీఏ) వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐ అండ్ డీఎస్) విభాగం నుంచి ​ప్రథమ స్థానంలో పోలిశెట్టి వైష్ణవి సత్య (89.0%), ​ద్వితీయ చాగంరెడ్డి దివ్యవాణి (87.5%), ​తృతీయ ఈలప్రోలు శివసాయి శరణ్య (87.0%) సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (ఎస్జీపీఏ) సాధించారు. అలాగే ​కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) విభాగం నుంచి 

​ప్రథమ పాలెం రమ్యస్ఫూర్తి (86.5%), ​ద్వితీయ గుదే రమ్యకృష్ణ (89.5%), తృతీయ రెసోజు నాగవెంకట సాయిశృతి (83.0%), పిటక వసంత వాహిని (83.0%) ఎస్జీపీఏ సాధించినట్లు తెలిపారు. సీఎస్ఈ- ఏఐ అండ్ ఎంఎల్ (సీఎస్ఎం) విభాగం నుంచి ​ప్రథమ స్థానంలో బమ్మిడి కళాంజలి (90.5%), ​ద్వితీయ స్థానం కోడిగంటి సత్యవాణి (86.0%), ​తృతీయ స్థానం మహమ్మద్ ఐనస్ జోహా (84.5%) సాధించారు.

​ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీజీ) విభాగంలో ప్రథమ స్థానం గుగులోతు గణేష్ (90.5%), ​ద్వితీయ స్థానం అరిచేపల్లి సాయికుమార్ (87.0%), తృతీయ స్థానంలో జానపాటి అనురాధ (85.5%) ఎస్ జీ పీ ఏ సాధించారు. ​ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం నుంచి ​ప్రథమ స్థానం పేటేటి లక్ష్మీ కార్తీక్ (78.0%), ​ద్వితీయ స్థానం బారు అభిలాష (75.0%), తృతీయ స్థానం ఎక్కిరాల శిరీష (74.0%), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ విభాగం నుంచి ​ప్రథమ స్థానం బండ్ల రాకేష్ (81.1%), ​ద్వితీయ స్థానం చెక్కా ధనుషా (78.6%), తృతీయ స్థానం చెరుకు సౌమ్య (77.1%), కిష్టం సాయికృష్ణ (77.1%), పిల్లెం కృష్ణవేణి (77.1%) చొప్పున ఫలితాలు సాధించినట్లు సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి తెలిపారు.

విద్యార్థులు సాధించిన అత్యుత్తమ ఫలితాలపై ఆ కళాశాల చైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్ గా  విద్యార్థులను, ప్రోత్సహించిన  అధ్యాపకులను, తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల నిరంతర శ్రమ, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ పాముల శేఖర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ హెచ్‌ఓడీ డాక్టర్ షేక్ మీరాసాహెబ్, ఇతర విభాగాల అధిపతులు విద్యార్థులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -