Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలోకి వస్తున్న ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ రాములు తెలిపారు. గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ ను కోరగా తక్షణమే ఆయన స్పందించి బిబిపేట మీదుగా జేబీఎస్ వరకు వెళ్లే బస్సును గ్రామం మీదుగా పంపిస్తున్నారని గుర్తు చేశారు. రామాయంపేట హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు‌. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -