Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ డైరెక్టర్స్ అవార్డు అందుకున్న శశాంక్ రెడ్డి 

అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ డైరెక్టర్స్ అవార్డు అందుకున్న శశాంక్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మైదాన్ ఎక్స్‌పో సెంటర్ లో జరిగిన భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026లో ప్రముఖ విద్యా సంస్థ కాంతి హైస్కూల్ డైరెక్టర్ వెల్పూర్ శశాంక్ రెడ్డి  ప్రతిష్టాత్మక డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ డైరెక్టర్స్ అవార్డును శుక్రవారం అందుకున్నారు.

ఈ కే ఉపదేశ్ మీడియా..టైమ్స్ ఫౌండేషన్ సంయుక్తంగా, భారత ప్రభుత్వ స్కిల్ ఇండియా, ఎన్ ఎస్ డి సి  సహకారంతో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి విద్యా సదస్సులో దేశవ్యాప్తంగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, నూతన విద్యా విధానాల అమలు మరియు విద్యా ప్రమాణాల పెంపుదలకు శశాంక్ రెడ్డి  చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డును తన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని, మాజీ రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం పేరు మీద వచ్చిన ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ఈ ఘనత సాధించిన సందర్భంగా కాంతి హైస్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు  తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -