Friday, August 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి

ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్  
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలపై బిఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు మానుకోవాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు థోండి రమణ శుక్రవారం తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న నిరాధారమైన అబద్ధపు ఆరోపణలు సరికాదని అన్నారు. ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి పథకానికి చట్టబద్ధత కల్పించకపోవడం వల్లే నేడు హైకోర్టులో న్యాయపరమైన సమస్యలు తలెత్తితే.. అసలు ఈ పథకాలనే నిలిపివేస్తున్నారంటూ అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బిఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని, ఏలాంటి లొసుగులు లేకుండా సరైన విధానంలోగత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని  అభిప్రాయపడ్డారు. ఈ పథకాలపై లోప భూయిష్టమైన జీవోలు ఇవ్వడమే ప్రస్తుత పరిస్థితికి కారణమనీ, అబద్ధపుప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని నిలిపివేసినట్లు తప్పుడు అబద్ధపుప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలఅమలుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వహయంలో జరిగిన పొరపాటు కారణంగానే ఈ పథకాలను నిలిపివేస్తూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులను ఇచ్చిందని, ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచీలలో అప్పీలు చేయనున్నట్లు పేర్కొన్నారు. బిఆర్ఎస్ నాయకులు కల్లబొల్లిమాటలు మానుకోవాలనీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యధావిధిగా కొనసాగిస్తుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -