Friday, August 21, 2026
E-PAPER
Homeబీజినెస్విశాఖపట్నంలో తమ రెండవ ఫ్రాంచైజ్ షోరూమ్‌ను ప్రారంభించిన యాక్టివ్. ఇన్

విశాఖపట్నంలో తమ రెండవ ఫ్రాంచైజ్ షోరూమ్‌ను ప్రారంభించిన యాక్టివ్. ఇన్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: యాక్టివ్ గ్రీన్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (యాక్టివ్. ఇన్) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న సీతమ్మధారలో తమ రెండవ ఫ్రాంఛైజీ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రెడాయ్ (CREDAI) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బైరా శ్రీనివాస్, వైజాగ్ అధ్యక్షుడు ధర్మేంద్ర సహా ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ నూతన షోరూమ్‌లో కస్టమర్లు, బిల్డర్లు కొనుగోలు చేయడానికి ముందే ఉత్పత్తుల నాణ్యత, సాంకేతికతను నేరుగా పరిశీలించే అవకాశం కల్పించారు. ఇక్కడ యాక్టివ్ మరియు షుకో అల్యూమినియం కిటికీలు, తలుపులు, రెయిలింగ్‌లు, హోమ్ ఆటోమేషన్, లైటింగ్, హోమ్ థియేటర్ సిస్టమ్‌లు వంటి ఆధునిక స్మార్ట్-లివింగ్ ఉత్పత్తులు లభ్యమవుతాయి. కస్టమర్ల అవసరాలకు తగిన సమగ్ర పరిష్కారాలను అందించడమే ఈ షోరూమ్ ముఖ్య ఉద్దేశమని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -