Saturday, August 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశద్రోహులను కలిసేందుకే...

దేశద్రోహులను కలిసేందుకే…

- Advertisement -


సీఎం అమెరికా పర్యటనపై 
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశద్రోహులను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అమెరికా పర్యటనను పెట్టుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. సరైన సమాచారం చెప్పకపోవడం వల్లే ఆయన్ను ఆపేసి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అమెరికా వీసా రాకుండానే టికెట్లు ఎందుకు కొన్నారని సీఎంను ప్రశ్నించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కూతురు ‌పెండ్లికి వెళ్తే సొంత ఖర్చులతో వెళ్లాలిగానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? అని నిలదీశారు. ఆయన పర్యటనలో ఏదో ఉద్దేశం ఉందన్నారు. అందుకే అధికారుల బృందానికి అనుమతి ఇచ్చి, సీఎంకు అనుమతి ఇవ్వలేదన్నారు. సీఎం పర్యటనను కేంద్రం అడ్డుకున్నట్టు తమకు తెలియదని చెప్పారు. ఈ అంశంలో కేంద్రంపై విమర్శలు చేయడం సరైందికాదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -