Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్25న 'శాంకరీయం'పుస్తకావిష్కరణ

25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఆలేరు శ్రీరామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్, కవి బండిరాజుల శంకర్ శతక సంపుటి శాంకరీయం పుస్తకావిష్కరణ సభ ఈనెల 25న శ్రీరామకృష్ణ విద్యాలయంలో ఉంటుందని నిర్వాహకులు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప సభాధ్యక్షులుగా, ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి ముఖ్య అతిథిగా, ప్రముఖ కవులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ భేరి సునీతా రామోహనరెడ్డి అతిథులుగా, డాక్టర్ పాండాల మహేశ్వర్ పుస్తక సమీక్షకులుగా హాజరుకానున్నారు.

తేజ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, కవులు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో ఈ పుస్తకావిష్కరణ సభలో పాల్గొనవలసిందిగా బండిరాజుల శంకర్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -