Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా యువజన క్రీడల అధికారికి సన్మానం

జిల్లా యువజన క్రీడల అధికారికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
యాదాద్రి భువనగిరి జిల్లాకు నూతనంగా ప్రమోషన్ పై వచ్చిన జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే. ధనుంజయ, జిల్లా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, ఆలేరు పట్టణంలో  ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ పక్షాన ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో అసోసియేషన్ పక్షాన ఘనంగా సన్మానించారు.

 ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య, రాష్ట్ర కోకో ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, జిల్లా కబడ్డీ అసోసియేషన్, కోశాధికారి గంధమాల కుమార్, సహాయ కార్యదర్శులు చిందం విజయ్ కుమార్, పూల చంద్రకుమార్, కార్యవర్గ సభ్యులు రాహుల్ తేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -