Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోస్టుల భర్తీ కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించండి

పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించండి

- Advertisement -

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు 
నిరుద్యోగుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పరిధిలోని వివిధ విద్యాసంస్థల్లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం శాసన మండలి లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను తెలంగాణ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నిరుద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో ఆ సంఘం ఆధ్వర్యంలో పలువురు సీఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు మల్లన్నను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 35 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష నియామకాలు లేక 2 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శాసనమండలిలో తమ సమస్యలను లేవనెత్తాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -