Monday, August 24, 2026
E-PAPER
Homeఖమ్మంసారంపల్లి మృతి రైతులోకానికి తీరని లోటు

సారంపల్లి మృతి రైతులోకానికి తీరని లోటు

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు
– ప్రజా సంఘాల కార్యాలయంలో మల్లారెడ్డి సంతాప సభ 
నవతెలంగాణ-సత్తుపల్లి 

ప్రముఖ రైతు నేత, సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ కార్యదర్శివర్గ సభ్యుడు, అఖిల భారత కిసాన్ సభ మాజీ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి (90) మృతి పట్ల సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ, తెలంగాణ రైతు సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి సంతాప సభను స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు.  

​ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగ ఉద్యమాలను బలోపేతం చేయడంలో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ​పేదలు, దళితుల భూముల పరిరక్షణ, సాగునీరు, వ్యవసాయ సంక్షోభంపై ఆయన జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ, రైతు సంఘం నిర్మాణంలో విశేష సేవలు అందించారని తెలిపారు. రైతాంగ సమస్యలపై పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయమని, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా నాయకులు రావుల రాజబాబు, చావా రమేష్, గుదే రాము, చెరుకు శ్రీను, పుష్పవల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -