Monday, August 24, 2026
E-PAPER
Homeఖమ్మంసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రాగమయి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రాగమయి

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం సాయంత్రం  మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ తో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కే.ఆర్. నాగరాజుతో డాక్టర్ మురళీ నాయక్, ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ విదేశీ పర్యటన దిగ్విజయంగా పూర్తి కావడం పట్ల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -