ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్
హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ
సీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ పిలుపు
పాల్గొననున్న మృతి చెందిన నీట్ విద్యార్థుల
కుటుంబాలు, పోలీసు దౌర్జన్య బాధితులు
దేశ యువతకు జులై 25న ఇచ్చిన హామీల
అమలులో కేంద్రం విఫలంపై ఆగ్రహం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ యువతకు జులై 25న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహిం చనున్నట్టు సీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. మృతి చెందిన నీట్ విద్యార్థుల కుటుంబాలు, పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితు లు ఈ ర్యాలీకి నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. యువతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చేసిన హామీల అమలుపై సమీక్షించేందుకు సీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ-ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలుకు బదులుగా ప్రభుత్వం కాలయా పన చేస్తోందని, కీలకాంశాలపై స్పష్టత ఇవ్వకుండా తప్పించుకుంటోందని కమిటీ విమర్శించింది. ఆగస్టు 18న దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను అందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని పేర్కొంది. సీజేపీకి ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని తెలిపింది.
బలహీనతగా భావించొద్దు
తమ సహనాన్ని ప్రభుత్వం బలహీనతగా భావించరాదని సీజేపీ హెచ్చరించింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేసిం ది. సెప్టెంబర్ 5న ఇండియా గేట్ వద్దకు దేశవ్యా ప్తంగా యువత, విద్యార్థులు, యువజన సంఘా లు, విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలు ముం దుం టాయని, పోలీసు దౌర్జన్య బాధితులు వారితో కలిసి నడుస్తారని సీజేపీ తెలిపింది. వారి వెనుక దేశ యు వతరం ఒక్కటే డిమాండ్‌తో ముందుకు సాగుతుం దని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది.
సెప్టెంబర్ 5న యువత భారీ ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



