Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలి

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వంటి భయానక రోగాలు వస్తాయని మద్నూర్ గ్రామానికి చెందిన తమ్మే వార్ అరవింద్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నిషేదంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా..వాడకుండా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నావంతు వరకు నేను ఏదైనా శుభ కార్యాలకు వెళితే ఇంటి నుంచి తీసుకెళ్లిన స్టీల్‌ ప్లేట్‌ లోనే భోజనం చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం మండల కేంద్రంల ఓ శుభకార్యానికి హాజరైన ఆయన తన సొంత ప్లేట్లోనే భోజనం చేసే దృశ్యం నవతెలంగాణ “క్లిక్‌” మనిపించింది. ఈ చిత్రం చూపరులను ఎంతో ఆకట్టుకుంది. వేడుకకు హాజరైన పలువురు ఆయనను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -