Thursday, August 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్‌లో పడిన విదేశీయుడు

ప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్‌లో పడిన విదేశీయుడు

- Advertisement -

రక్షించిన పోలీసులు
విచారించి స్నేహితునికి అప్పగింత
​నవతెలంగాణ – ముషీరాబాద్

​హుస్సేన్ సాగర్ లో ప్రమాదవశాత్తు పడిన ఓ విదేశీయుడిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు చెందిన పెట్రోల్ కార్ పోలీసులు రక్షించారు. లేక్ పోలీస్ స్టేషన్ ఇన్‌‌స్పెక్టర్ వి.శ్రీనివా సరావు తెలిపిన వివరాల ప్రకారం.. సూడాన్ దేశానికి చెందిన నజర్ ఆడం బాధవి మాహాది విద్యాభ్యాసం కోసం భారతదేశానికి వచ్చాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌‌లో భగవంత్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట తన సోదరుని స్నేహితున్ని కలుసుకునేందుకు హైదరాబాద్‌ కు వచ్చి టోలిచౌకి పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫారామౌంట్ కాలనీలో నివసిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల 20 నిమిషాల సమయంలో ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా నిలబడి హుస్సేన్ సాగర్ వైపు చూస్తున్నాడు. అకస్మాత్తుగా అతను కాలుజారి అందులో పడిపోయాడు. వెంటనే పెట్రోలింగ్ లో ఉన్న సైఫాబాద్ పోలీసులు తాడును ఉపయోగించి అతన్ని బయటకు తీశారు. అనంతరం అతడిని లేక్ పోలీసులకు అప్పగించారు. వారు విదేశీయుడి వివరాలు పూర్తిగా తెలుసుకొని చెల్లుబాటులో ఉన్న పాస్‌‌పోర్ట్, వీసాను పరిశీలించి అతన్ని స్నేహితుడికి అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -