– ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
దేశ పురోగతి మహిళల స్వయం ఉపాధితోనే సాధ్యపడుతుందని కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ భూదేవి హిల్స్ ప్రాంతంలోని భూదేవి మహిళా పరపతి సంఘం, తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివద్ధి సంస్థ, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణా తరగతుల సర్టిఫికెట్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్‌లు ముఖ్య అతిథులుగా హాజరై శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడడంలో ఇలాంటి శిక్షణా తరగతులు ఎంతగానో దోహద పడతాయన్నారు. మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెందడంలో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇటువంటి శిక్షణా తరగతుల ద్వారా మహిళలు స్వయం ఉపాధి చెందుతూ పది మందికి మార్గం చూపేవారుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కష్ణా గౌడ్, యువ నాయకులు కొలుకుల జైహింద్, భూదేవి మహిళా పరపతి సంఘం అధ్యక్షురాలు త్రివేణి దేశినేని, దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ లక్ష్మి కుమారి, మోవో పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట: అసెంబ్లీ ఎన్నికల్లో నా హ్యాట్రిక్ విజయానికి తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికి జీవిత కాలం రుణపడి ఉంటానని స్థానిక ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి షిరిడి హిల్స్, కూన మహాలక్ష్మి నగర్, రాజీవ్ గహకల్ప, భూదేవి హిల్స్ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ స్థానిక ప్రజలతో కలిసి మూడవ రోజు కతజ్ఞత యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో నియోజకవర్గ అభివద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులతో గత తొమ్మిదేండ్ల కాలంలో చేపట్టిన అభివద్ధిని, సంక్షేమాన్ని చూసి మీ ఇంటి బిడ్డగా నాకు ఇంతటి అఖండ విజయాన్ని అందించినందు కు మీ సేవకుడిగా పని చేస్తానన్నారు. ముందుగా షిరిడిహిల్స్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు ఓరుగంటి కష్ణా గౌడ్, సయ్యద్ రషీద్, విఠల్ ముదిరాజ్, బీఆర్‌ఎస్ యువ నాయకులు జైహింద్ పాల్గొన్నారు.