– సీపీిఐ(ఎం) మండల కార్యదర్శి నరేష్
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ మండల పరిధిలోని రావల్‌కోల్ అనుబంధ గ్రామాలైన గూడెంగడ్డ, దొంగలగుట్ట తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీిఐ(ఎం) మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో బుధవారం మండల సూపరిండెంట్ ఉదరు కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ.. రావల్‌కోల్ గ్రామంలోని జీవన్‌రెడ్డి తోట నుంచి దొంగలగుట్టతండా వరకు రోడ్డు వేయాలని కోరినట్లు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేక తండాలోని 400మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో స్కూలుకు వెళ్లే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. విద్యార్థులు చదువుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న తండాల దుస్థితికి స్థానిక రాజకీయ నాయకులు లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారు తప్పా.. సమస్యల ను పరిష్కరించే సోయి లేదని విమర్శించా రు. ఆర్టీసీ బస్సు సైతం రావడంలేదన్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు, అధికారులు, ఎమ్మెల్యే మల్లారెడ్డి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తండావాసులు తేజవత్ శారద, బానోత్ సుజాత, తేజవత్ కమల, తేజవత్ వంశీ పాల్గొన్నారు.