– ఉప్పల్, రామంతాపూర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ-ఉప్పల్
కేంద్రం తెచ్చిన హిట్రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఉప్పల్, రామంతాపూర్, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు వీరలాల్, కత్తుల యాదయ్య అన్నారు. బుధవారం హిట్రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పల్, రామంతాపూర్ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త హిట్రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డ్రైవర్స్ అగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. చట్టాన్ని రద్దు చేయకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నారు. డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, మల్లేష్, కష్ణ, తదితరులున్నారు.