Thursday, August 27, 2026
E-PAPER
Homeఖమ్మంప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం : సీపీఐ(ఎం)

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం : సీపీఐ(ఎం)

- Advertisement -

– సీపీఐ(ఎం) నాయకులు అర్జున్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట : రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ విమర్శించారు. పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు పెన్షన్లు, రేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.

గురువారం దమ్మపేట మండలంలో ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా పేదల సమస్యలపై తగిన శ్రద్ధ చూపడం లేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా నివాస స్థలాలు, ఇళ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు.

పాలకులు మారుతున్నా ప్రజల మౌలిక సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇకనైనా అమలు చేయాలని, లేనిపక్షంలో గత పాలకులకు పట్టిన గతే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.

పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 31న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న ఆందోళనలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, మంగ, అంజలి, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -