Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని పాదయాత్ర

జుక్కల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని పాదయాత్ర

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యలపై వెంటనే పూర్తీ  చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం నాడు పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా మహ్మదాబాద్ చౌరస్తా నుండి జుక్కల్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టిన హన్మంత్ షిండే , జుక్కల్ చౌరస్తా నుండి ఖండేబల్లూర్ వరకు రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా, నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు. రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

“ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రపోతుంది. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే గుర్తించి రోడ్డు పనులను పూర్తి చేయాలి” అని హన్మంత్ షిండే  డిమాండ్ చేశారు.

జుక్కల్ చౌరస్తా నుండి ఖండేబాల్లూర్  వరకు రోడ్డు పనులను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు సురక్షితమైన రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి!
జుక్కల్ ప్రజల సమస్యలు పరిష్కరించాలి! వందలాదిగా ప్రజలతో, కార్యకర్తలతో భారీగా పాల్గోని పాదయాత్ర ను విజయవంతం చేసారు. అడుగడుగునా మాజీ ఎమ్మెల్యే ను రొడు సైడ్ గ్రామాలు, గ్రామాల ప్రజలు కలిసి గోడును తెలియచేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -