Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ పంచాయతి కంప్యూటర్ ఆపరేటర్ లేక అవస్థలు పడుతున్నా ప్రజలు

ఈ పంచాయతి కంప్యూటర్ ఆపరేటర్ లేక అవస్థలు పడుతున్నా ప్రజలు

- Advertisement -

నవతెలంగాణ-జుక్కల్  : జుక్కల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు లేక మండలంలోని 30 గ్రామ పంచాయతీల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని మండల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం ఎంపీడీవో కార్యాలయంలోఈ – పంచాయతీ జుక్కల్ నందు 30 గ్రామ పంచాయతీలు కలవు. ఇక్కడ ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు పని చేస్తున్నారు.  ఎప్పుడు 1 ఆపరేటర్లు డిపుటేషన్ పైన ఒకరికి బీర్కూర్ కి పంపడం అయినది. ఒక ఆపరేటర్ మెటర్నిటీ లీవ్ లో పంపడం అయినది. ఉన్న జూనియర్ అసిస్టెంట్ ని కూడా డిప్యూటేషన్  పైన డోoగ్లీ మండలానికి  పంపడం జరిగింది.కావున వివిధ పనుల నిమిత్తం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి మండల వాసులకు ,  ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనుల కోసం వచ్చే ప్రజలు పలుమార్లు వచ్చి వెనుతిరిగిపోవడం తో పాటు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చినప్పుడు అల్లా ఆర్థికంగా జేబులు ఖాళీ కావడమే కాక అటు వ్యవసాయ పనులు కూడా చక్కబెట్టుకోలేకపోతున్నామని వాపోయారు. వెంటనే జిల్లా అధికారులు డిప్యూటేషన్ పై పంపించిన అధికారులను యధావిధి స్థానంలో కొనసాగించే విధంగా ఆర్డర్స్ జారీ చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు సహకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -