నవతెలంగాణ- జుక్కల్ : మండలంలోని పెద్ద గుల్లా తాండ లో ప్రభూత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎంపి పీఎస్ పాఠశాల ఆవరణలో ఉచితంగా ఆరోగ్య శిబిరం గ్రామ సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ చేతులు మీదుగా ప్రారంభించడం జరిగిందని జీపీ కార్యదర్శి నాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి హెల్త్ క్యాంపులో ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఈ వైద్య శిబిరం నకు వృద్దులు, మహిళలు, చిన్న పిల్లలు , పెద్దలు , యువకులు వైద్య శిబిరంలో పాల్గోని వైద్య పరీక్షలు చేయించుకొని చూపారు . వచ్చిన రోగులకు త్రాగు నీరు, నీడ వసతి సౌకర్యాలు జీపీ ఆధ్వర్యంలో కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జీపీ కార్యవర్గ సభ్యులు, జీపీ కార్యదర్శి నాగయ్య, ఆశావర్కర్ , అంగన్ వాడి టీచర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అఖిల, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
పెద్ద గుల్లా తాండాలో ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభించిన గ్రామ సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



