Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి 

సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, మున్సిపల్ చైర్మన్ బిజన బాలమణి  అన్నారు. ఆలేరు పట్టణంలో  గురువారం సర్ ప్రక్రియ  సకాలంలో పూర్తి చేసేందుకు  ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక మున్సిపల్ రెవిన్యూ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించారు.

సర్ ప్రక్రియలో మిగిలిపోయిన  ఓటర్లు తమ యొక్క బయోడేటా తో ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని అధికారులు  కోరారు. సర్ ప్రక్రియలో ప్రస్తుతం పూర్తయిన వివరాలు అధికారులు చదివి వినిపించారు. లిస్ట్ లో  వివిధ కారణాల వల్ల పేరు నమోదు లేకుండ మిగిలి ఉండి, నోటీస్లు వచ్చిన వారికి ప్రభుత్వం  సూచించిన ధృవ పత్రాల సమర్పించి తమ ఓటు హక్కును తిరిగి పొందాలని సూచించారు. ఈ సమావేశంలో   కమిషనర్ 

కే. శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్ సభ్యులు పస్తo ఆంజనేయులు, జూకంటి సంపత్, కో ఆప్షన్ సభ్యులు ఎమ్మెస్   విజయ్ కుమార్, చింతకింది మురళి, మున్సిపల్ మేనేజర్ బి. జగన్ మోహన్,రెవెన్యూ  ఆర్ ఐ  భద్రయ్య , బి ఎల్ వో లు   లు ,వివిధ పార్టీల ప్రతినిధులు, స్థానికులు  తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -