– సర్ పేజ్ టూ లో అర్హు ల ఓట్లన్నీ ఉండేలా చూడాలి..
– స్మార్ట్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే మురళి నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సార్ పేస్టులో అర్హులందరికీ ఓట్లు ఉండే విధంగా సరిచేసుకోవాలని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపాడు. గురువారం ఆ గ్రామ సర్పంచ్ కొండ జనార్దన్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దే అని అన్నారు. గత బిఆర్ఎస్ 10 సం.ల ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. రాజుల కొత్తపల్లి గ్రామంలో సర్పంచి కొండ జనార్దన్ రెడ్డి, ప్రహసిల్దార్ చంద నరేష్ ప్రభృతులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డుల తో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుందని దీనిని స్కాన్ చేయడం ద్వారా క్షణాల్లో కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పొందడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఇతర సేవలకు స్మార్ట్ కార్డ్ గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు.
సర్ లో అర్హుల ఓట్లన్నీ నమోదు చేయించాలి..
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంవత్సర సవరణ పేజ్ టులో నైనా అర్హులైన వారందరి ఓట్లన్నీ ఉండేలా చూడాలని బిఎల్ఎ లకు ఎమ్మెల్యే సూచించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు పారదర్శకంగా ఓటర్ నమోదు ప్రక్రియను నిర్వహించాలని కోరారు. బిఎల్ఏలు బిఎల్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఓటరు నమోదు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా, సరైన చిరునామాతో నమోదు చేయాలన్నారు. అర్హుల ఓట్లు తిరస్కరణకు గురైతే పునర్ నమోదు చేయడం కష్టమవుతుందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ చూపి అర్హులనువిస్మరించకుండా సర్ ప్రక్రియలో ఓటు నమోదు చేయించాలని, ఈ మేరకు బిఎల్ఏలు తీవ్రంగా కృషి చేయాలన్నారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ గణేష్,శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ దామోదర్ రెడ్డి, పత్తిపాక తిరుపత చారి, వెల్ది గోవర్ధన్ రెడ్డి, తూల్ల నరేందర్, రామచంద్రారెడ్డ, డేగల వెంకన్న, తుళ్ళ ప్రణయ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ జిపిఓ రమేష్ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్. మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి సర్పంచ్ కొండా జనార్దన్ రెడ్డి
మా రాజుల కొత్త పల్లి గ్రామానికి మహబూబాబాద్ నుండి నెల్లికుదురు వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ను కోరినట్లు సర్పంచ్ కొండా జనార్దన్ రెడ్డి తెలిపారు. గతంలో వరంగల్ బస్సు ఇటువంటి వెళ్లేదని ఇప్పుడు అది మొత్తం రాక ఈ గ్రామం నుండి మండల కేంద్రంలోకి పోవడానికి అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అంతే కాకుండా ఈ గ్రామం నుండి మోడల్ స్కూల్ స్కూలుకు విద్య ను అభ్యసించే కొరకు పిల్లలు వెళ్తున్నారని వారికి బస్సు సౌకర్యం లేక ఆటోలో వెళుతన్నారని అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగ రైతులు ఏదన్నా అత్యవసర పనుల మీద వెళ్లి రావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే కల్పించాలని చెప్పారు. అదేవిధంగా మా గ్రామానికి ఊరు వెంబటి ఒక కాజ్వే ఉందని అది చాలా శిధిల వ్యవస్థలో ఉండి అనేక ఇబ్బంది ఉందని వెంటనే దాన్ని మంజూరు చేసి నూతన హైవే బ్రిడ్జి నిర్మించాలని కోరినట్లు చెప్పారు.
రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



