Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి పంటలో ఆకుచుట్టు, కాండం తొలుచు పురుగు గుర్తింపు

వరి పంటలో ఆకుచుట్టు, కాండం తొలుచు పురుగు గుర్తింపు

- Advertisement -


– రైతులకు జాగ్రత్తలు సూచించిన ఏవో ఆర్. నరేష్
నవతెలంగాణ – రాయపోల్ : వరి పంటలో ఆకుచుట్టు, కాండం తొలుచు పురుగు ఉదృతీ ఎక్కువగా ఉందని గుర్తించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్ అన్నారు. గురువారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంటలో ఆకుచుట్టు పురుగు, కాండం తొలుచు పురుగు ఉధృతి ఉన్నట్లు గుర్తించమన్నారు.ఈ పురుగుల ఉధృతి యూరియాను అధికంగా వినియోగించడం వల్ల పెరిగే అవకాశం ఉందని ఆయన రైతులకు సూచించారు. రైతులు అవసరమైన మేరకే యూరియాను దఫాల వారీగా వినియోగించాలని, మోతాదుకు మించి యూరియా వేయకూడదని సూచించారు.ఆకుచుట్టు, కాండం తొలుచు పురుగుల నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలను ఎకరానికి 8 నుంచి 10 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 శాతం జీ గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున ఇసుకలో కలిపి పొలంలో చల్లడం ద్వారా పురుగులను నియంత్రించవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పురుగు మందులను వినియోగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తిమ్మక్ పల్లి సర్పంచ్ అశోక్‌రెడ్డి, ఏఈఓ రజిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -