– మండల విద్యాశాఖ అధికారి ఎస్. రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్ : విద్యార్థుల్లో పఠన, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు కథల రూపంలో సులభంగా నేర్చుకునేలా చేయాలనే ఉద్దేశంతో రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల గ్రంధాలయాన్ని ప్రారంభించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి ఎస్. రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం ఎంపీయూపీఎస్ కొత్తపల్లి పాఠశాలలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయంలో వివిధ రకాల కథల పుస్తకాలను అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు కథల ద్వారా కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చని వారు తెలిపారు. చిన్నారుల్లో చదివే అలవాటును పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యామల మల్లేశం, గ్రామ ఉపసర్పంచ్ స్వామి,రాయపోల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి నాగరాజు, ఏఏపీసీ చైర్మన్ రాధ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం నాగరాజు, రూమ్ టు రీడ్ కో-ఆర్డినేటర్ మధు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
కథలతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యానికి మెరుగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



