Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొడ్రాయి ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

బొడ్రాయి ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

- Advertisement -


నవతెలంగాణ – రాయపోల్ : రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠ, గ్రామ దేవతల ఉత్సవాలకు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి గురువారం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్రాయి అమ్మవారికి పూజలు చేసి గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు.అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బొడ్రాయి అమ్మవారి అనుగ్రహం దుబ్బాక నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ పాడిపంటలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని కోరుకున్నారు. గ్రామంలో ప్రజల ఐక్యత, సుఖశాంతులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మహమ్మద్ పర్వీజ్, ఉపసర్పంచ్‌ బంధారం సంతోష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మున్నా, మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు రాజిరెడ్డి, బాగిరెడ్డి, దండు స్వామి, షాదుల్లా, నగేష్, ఇస్తారి, బాల్ నర్స్, మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలు, బాల్ రెడ్డి, విష్ణు రెడ్డి, రామచంద్రం గౌడ్, శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -