ప: విప్లవాల సారం బోధించిన శిఖరం
బతికినంత కాలం నువు నడిపినావు సమరం -2
జోహార్లు జోహార్లందుకో…
సారంపెల్లి మల్లారెడ్డి జోహార్లందుకో -2
చ:త్యాగాల తరం మీది దిక్కార స్వరం నీది బోగాలు మరచినారు ఉద్యమాలు వలచినారు
తెలుగునేల నలుచెరగుల ఉద్యమాల వన్నెలద్ది
నర్సంపేట గడ్డమీద పోరాటాల నడక దిద్ది ll
చ: పోరాటాల సారమంతా మార్క్సిజంలో బోధించి
నిత్య జీవితంలో ప్రజల కష్టాలను రంగరించి
జీవితమంటేనే నిత్య పోరాటం అని చెప్పి
నిలిచినావు అతివాదం, మితవాదాన్నెదిరించి ll
చ: మార్క్సిస్టు పార్టీ నీ కుటుంబం అన్నావు
కమ్యూనిస్టులందరు నీ కంటిపాపలన్నావు
కన్నభిడ్డలకు మిన్నగ మమ్ములను ప్రేమించి
మమ్మొదిలి పోయావా ఆశయం అందించి ll
చ: ఆశయాల పోరులో అమరులైన వీరులు
ఏసిరెడ్డి, చంద్రారెడ్డి, మంతెన నారాయణరెడ్డి
నువునడిచిన దారిలో కొనసాగుతున్న ధీరులు పోరాటాల కొలిమిలో రాటుదేలుతున్నరు. సమసమాజ ఆశయంతో కడవరకు నడుస్తాం
శపథం చేస్తున్నాం అందుకో లాల్ సలామ్ ll
(సారంపల్లి మల్లారెడ్డి స్మృతి గీతం)
-సాంబరాజు యాదగిరి,
9346018141
విప్లవాల‘సారం’పల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



