అమెరికా-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై అక్రమంగా ఫిబ్రవరి 28న ప్రారంభించిన దాడులతో తలెత్తిన సంక్షోభానికి ఆరునెలలు నిండాయి.మిలిటరీ చర్యలతో ఇంకేమాత్రం ప్రయోజనం లేదని, ఇరాన్ లొంగేఘటం కాదని మిలిటరీ, సలహాదారులు తెగేసి చెప్పటంతో గత కొద్ది వారాలుగా దాడులు లేవు. బలప్రయోగానికి బదులు ఆర్థిక ఆంక్షలతో మరింతగా వత్తిడి తెచ్చేందుకు ట్రంప్ సరికొత్త ఆంక్షలను ప్రకటించాడు. ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీలను జరిపే దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తామని చెప్పాడు. అయితే తాజా ఆంక్షలు కొత్తగా ఇరాన్‌కు చేసే హానేమీ లేదని పరిశీలకులు చెప్పేశారు. అయితే ఇలాంటి పరిణామాలను ఇరాన్ ముందే ఊహించింది. తమ పౌరులు కొంత మేరకు ఇబ్బందులు పడుతున్నారని నేతలు బహిరంగంగానే అంగీకరిస్తూ, తాజా ఆంక్షలను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకున్నామని కూడా ప్రకటించారు. ఇరాన్ చెప్పే మాటలు కొందరికి అతిశయో క్తిగా అనిపించవచ్చు గానీ గత ఆరు నెలల్లో వారు చెప్పిందే వాస్తవ మని, ట్రంప్ చెప్పి నట్లుగా జరగలేదని ఇప్పటికే రుజు వైంది. నాలుగైదు వారాల్లో టెహరాన్ సంగతి తేల్చేస్తామని, కాళ్ల బేరానికి తెస్తామని కోతలు కోశాడు.
ఆరునెలల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంక్షోభం నుంచి బయటపడి నవంబరు మూడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల ముందుకు ఎలా వెళ్లాలో అతగాడికి దిక్కుతోచటం లేదు. ఇరాన్‌పై దాడులకు మొత్తంగా అమెరికన్ పౌరులే కాదు, చివరికి స్వంత పార్టీ వారి మద్దతే రోజు రోజుకూ తగ్గుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ చేతిలో అటు పరువూ పోయి ఇటు చేతి చమురు వదిలిస్తున్న నిర్వాకం గురించి అడిగే ప్రశ్నలకు వెర్రిచూపులు తప్ప ట్రంప్‌కు నోట మాట రావటం లేదు. పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. హార్ముజ్ జలసంధి తెరిచే ఉందని, అడపాదడపా ఇరాన్ వైపు నుంచి వస్తున్న కొన్ని క్షిపణలు, సముద్రంలో మందుపాతరలు అమర్చటం తప్ప నౌకల రవాణాకు ఎలాంటి ఆటంకం లేదని ప్రపంచాన్ని నమ్మించేందుకు చూడటం తాజా అబద్దం. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందానికి వచ్చినా తాట వలుస్తామని బెదిరించి నప్పటికీ హార్ముజ్ జలసంధిలో రెండుదేశాలూ కలసి నౌకలపై రాకపోకల రుసుము వసూలు చేసేందుకు ఇరాన్‌తో ఓమన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై విధించిన తాజా ఆంక్షలు అక్రమని చైనా వాటిని తిరస్కరించింది.
ఇరాన్ నుంచి అది ఇప్పటికీ పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నది. ఒక వేళ చైనా మీద కూడా ఆంక్షలు ప్రకటిస్తే కంటికి కన్ను పంటికి పన్ను మాదిరి బీజింగ్ కూడా బదులు తీర్చుకుంటుదని వేరే చెప్పనవసరం లేదు. గతేడాది ప్రకటించిన పన్నుల పట్ల అదే విధంగా వ్యహరించటంతో అమెరికా కాళ్లబేరానికి వచ్చి వెనక్కు తగ్గింది. ఒక్క ఇరానే కాదు, రష్యాతో లావాదేవీలు జరిపే దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తామని అది ప్రకటించింది. అయితే దాన్ని ధిక్కరించి మనదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ కిమ్మనటం లేదు. దీనర్ధం ఏమిటి? మనదేశం అమెరికాతో ఇతర విషయాల్లో రాజీపడుతున్నందుకు ఈ మినహాయింపా? ఇరాన్ మీద ఏకపక్షంగా దాడులు ప్రకటించినపుడు ట్రంప్ చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి ? టెహరాన్ ఒకటి రెండు నెలల్లోనే అణుబాంబును తయారు చేయగల సామర్ధ్యాన్ని సమకూర్చుకున్నదని ఫిబ్రవరికి ముందు మీడియాలో కథనాలు రాయించారు. ఇరుగుపొరుగు దేశాలకు తలెత్తిన ముప్పును తప్పించేందుకు దాడులు చేసినట్లు చెప్పారు. దాని వలన ఎలాంటి ఫలితమూ రాలేదు. అసలు శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఎక్కడ దాచిందో కూడా కనిపెట్టలేక పోయాడు. తరువాత హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛగా రాకపోకలు సాగించేం దుకు అడ్డుపడుతున్న ఇరాన్‌ను దెబ్బతీసేం దుకు దాడులని చెప్పాడు.
ఈ విషయంలో కూడా సాధించిందేమీ లేదు. ఇలా లక్ష్యాలను మారుస్తూ ఇప్పుడు ఆర్థిక వెలి ప్రచారాన్ని ప్రారంభించాడే. నిజానికి తనతో కలసి దుర్మార్గంలో నాటో దేశాలు పాలుపంచుకుంటాయని అమెరికా భావించాడు. కానీ, దాడులతో తమకు సంబంధం లేదని ఐరోపా దేశాలు అమెరికాను వెలివేశాయి. ఇరాన్ మీద దాడులకు విమానాలకు అవసరమైన ఇంధనం నింపుకొనేందుకు బల్గేరియా వంటి నాటో దేశాల్లో ఏర్పాట్లు చేసుకున్నది.అది తగదని టెహరాన్ హెచ్చరించిందే తప్ప ఎలాంటి చర్యలకూ దిగలేదు. అయితే అమెరికాకు బ్రిటన్ అప్పగించిన డిగోగార్సియా దీవిలోని మిలిటరీ స్థావరాలపై క్షిపణులను ప్రయోగించి తమ సత్తాఏమిటో చూడండని, దాని కంటే చాలా దగ్గరగా ఉన్న అలాంటి దేశాలకు ఒక సందేశాన్ని పంపింది. అవకాశవాదం లేదా తమకు రక్షణ కల్పిస్తుందనే విశ్వాసంతో గల్ఫ్ దేశాలు తమ గడ్డ మీద అమెరికా మిలిటరీ స్థావరాల ఏర్పాటుకు అవకాశమిచ్చాయి. వాటి మీద దాడులు చేసి తీవ్ర నష్టం కలిగించిన తీరు చూసి ఇరాన్ మీద దాడులు ఆపండని మీద వత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఆరునెలల్లో అనేక ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ట్రంప్‌నకూ అతగాడిని భరిస్తున్న అమెరికాకు బుద్దిరాలేదు!
ఇరాన్‌పై ఆగని దురాగతం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


