- Advertisement -
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు
ఏదైనా సమాచారాన్ని సేకరించడానికి ముందు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే పత్రికలే అవసరం. అలాంటప్పుడు ఏ పక్షానికి కొమ్ముకాయకుండా, ప్రజలవైపు నిలబడి నిష్పక్షపాతంగా వార్తలను అందించే పత్రికలనే నమ్మి వాటి ఆధారంగా లోతైన పరిశీలన చేస్తాం. అలాంటి పత్రికలలో నవతెలంగాణ ఒకటి. నేడు మనకు అలాంటి వార్తలనందించే పత్రికల సంఖ్య తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో ప్రజాదృష్టితో వార్తలు రాసే ఒక పత్రిక 11 ఏండ్లుగా కొనసాగడం చిన్న విషయం కాదు. ఈ సందర్భంగా ‘నవతెలంగాణ’ యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, సిబ్బందికి శుభాకాంక్షలు. ఈ ప్రయాణాన్ని ఇలాగే విజయవంతంగా కొనసాగించాలని ఆశిస్తున్నా.
- Advertisement -



