అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
రైతులతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
నవతెలంగాణ-నవాబుపేట
నవాబ్‌పేట మండల పరిధిలోని రాంసింగ్ తండాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సర్పంచ్ జ్యోతిఅంబదాస్ నాయక్ తో కలిసి శుక్రవారం పర్యటించారు.ఈ సందర్భంగా తండా పరిధిలో నిర్మిస్తున్న వ్యవసాయ కుంటలను( ఫారం పాండ్) ఆయన స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా వ్యవసాయ కుంటలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన తెలిపారు.పంటల సాగు సమయాల్లో లేదా వర్షాభావ (ఎండల) పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నీరు నీటిపారుదలకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనివల్ల పంట దిగుబడి పెరిగి రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని వివరించారు.ఈ పర్యటనలో భాగంగా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ స్థానిక రైతులతో కలిసి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.రైతులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం నాయక్ ఏపీఓ జ్యోతి టీఏ ముజీబ్ ఫీల్డ్ అసిస్టెంట్ పాండు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
రైతులు ‘వ్యవసాయ కుంటలు’ నిర్మించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



