Friday, August 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని వివిధ గ్రామాలలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పరం రాఖీలు కట్టుకుని మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -