Sunday, August 30, 2026
E-PAPER
Homeఖమ్మంఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలు బాధ్యతగా పనిచేయాలి

ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏలు బాధ్యతగా పనిచేయాలి

- Advertisement -

– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి

ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బాధ్యతాయుతంగా పనిచేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా బీఎల్ఏలు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు.

​సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల అవగాహన సదస్సు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడారు. ​సెప్టెంబర్ 30 వరకు గడువు ఉన్నందున ఓటర్ల అభ్యంతరాలు, అవసరమైన ధ్రువపత్రాల సమర్పణలో బీఎల్ఏలు పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

​కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఓటర్లకు అందుబాటులో ఉండాలని కోరారు. ​ఎస్ఐఆర్  ప్రక్రియలో బీఎల్ఏలు క్రియాశీలకంగా వ్యవహరించి, కేటాయించిన ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ​అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

​ఓటర్లకు ఎదురయ్యే అభ్యంతరాలు, సమస్యలను గుర్తించి వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.  బీఎల్ఏలు తమ బూత్‌ల పరిధిలో ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఓటరు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సమర్థవంతమైన ఓటర్ల జాబితా రూపకల్పనలోనే పార్టీ గెలుపు ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు.

​ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు ప్రతినిధుల సమక్షంలో ఓటర్ల జాబితాలను పంపిణీ చేశారు. ​ఈ అవగాహన సదస్సుకు నియోజకవర్గం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

​కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, ఎస్ఐఆర్ ఇన్‌చార్జ్ రవీంద్ర, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ ఎం.డి. రెహనా బేగం, కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ బాగం నీరజా చౌదరి, దోమ ఆనంద్, గాదె చెన్నారావు, నారాయణవరపు శ్రీనివాస్, చల్లగుండ్ల కృష్ణయ్య, ఉడతనేని అప్పారావు, చల్లారి వెంకటేశ్వరరావు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తల సమన్వయంతో సత్తుపల్లి నియోజకవర్గంలో ఓటర్ల సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని సమావేశం తీర్మానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -