- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని కొడిచెర గ్రామ శివారులో గల చేన్నమ్మ కోరి ఆలయంలో శ్రావణ శనివారం చిన్న ఎక్లారా గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏటా శ్రావణమాసంలో గ్రామస్తులంతా కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు, మహాన్నదానాలు చేస్తామని గ్రామ పెద్దలు చెప్పారు. శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చి, దర్శించుకున్నారని తెలిపారు.
- Advertisement -



